Monday, April 21, 2014

TV artist union Elected committee Felicaitation event (news)


టివి ఆర్టిస్ట్‌ యూనియన్ కు జరిగిన ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ గ్రేటర్‌ బంజారా వ్యయస్థాపక అధ్యక్షులు మేచినేని శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు... చంద్రముఖి సీరియల్‌ లో రౌడీ పాత్రదారి శ్రీనివాస చౌదరి ఆకస్మీత మరణానికి కొంత సేపు మౌనం పాటించి శ్రధ్దాంజిలి ఘటించారు.అనంతరం సభ అధ్యక్షులు మేచినేని శ్రీనివాసరావు ముఖ్యఅతిథి బి నర్సింగ్‌రావు గురించి మాట్లాడుతూ..... 70-80 సంవత్సరాల్లో 24 ఫ్రేమ్స్‌లోను పని చేశారు. దాసి నుండి 8 చిత్రాల వరకు దర్శకత్వం వహించారు.
సమాజం లోని కుళ్లును తొలగించి , నవ సామాజాన్ని స్థాపించాలనిది నర్సింగ్ రావు గారి కోరిక. ఆర్టిస్ట్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ స్థాపించి 15 ఎళ్లు అవుతుంది. ఆసోసియేషన్‌ అభివృద్దికి కృషి చేస్తున్నారు అన్నారు. అధ్యక్షులు డాక్టర్‌ వినోద్‌బాల మాట్లాడుతూ ఈ సంస్థ స్థాపించి 15 ఎళ్లు అవుతుంది. ఈ సంస్థతో పాటు 18 ఆసోసియేషన్స్‌ ప్రారంభించారు. కెమెరా ,రచయిత, ఇలాంటి ఆసోసియేషన్‌ అన్ని పని చేయడం లేదు. అప్పటి నుండి ఇప్పుటి వరకు నిలదొక్కుని నిలబడింది ఈ ఆసోసియేషన్‌ మాత్రమే . ఆట్టు, పోట్టు ఎప్పటికప్పుడు తింటు, నిల బడుతూ పయణీస్తున్నాం అన్నారు. ప్రధాన కార్యదర్శ విజయ్ యాదవ్‌ మాట్లాడుతూ ......కొత్తరాష్ట్రంలో ప్రభుత్వం టివి రంగాన్ని అబివృద్ది చేయాలన్నారు. టెలివిజన్‌ రంగాన్ని సపరేట్‌ కార్పొరేట్ సంస్థగా ఏర్పటు చేయాలని, ఆరొగ్యశ్రీ కార్డు అందించాలని, వృధ్దులకు పెంక్షన్‌లు, టివి నగర్‌ రూపకల్పన కొత్త ప్రభుత్వం నుండి సాధించుకోవాలని తొటి ఆర్టిస్ట్‌లకు పిలుపు నిచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ్‌ మాట్లాడుతూ ......15 ఎళ్లుగా సమస్యలను పరిష్కారించారు. డబ్బింగ్ సీరియల్‌ ను టివి ఛానల్స్‌ లో నిలిపి వేయాలని ఉద్యమం చేపట్టిన ఎంత మంది, చేస్తున్న పనులు ఆపి ఉద్యమంలో పాల్గోన్నాం అని ఆత్మ విమర్శ చేసుకొవాలి అన్నారు. విజయ్‌ యాదవ్‌ అన్నట్లు జరగాలంటే ప్రభుత్వంతో మమైకం అవ్యాలి . ఆర్టిస్ట్‌లు అందరూ సహకరిస్తే టివి నగర్‌ వస్తుంది. కార్ఫొరేట్‌ రాదు. మనకు ఏం లాభం ఉండదు. టివి రంగం వల్ల ఆర్టిస్ట్‌లకు మంచి జరుగుతుంది లాభం ఉంటుంది. కాని కార్ఫొరేట్‌ వల్ల ఏమి లాభం ఉండదు. ఎదిఏమైన కలసి కట్టుగా ఉంటే ఎదైనా సాధించవచ్చుఅన్నారు. డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ పాల రాజు ఐపిఎస్ మాట్లాడుతూ .........టివి ఆర్టిస్ట్లతో గతంలో పరిచయాలు లేకున్న ఈ 15 రోజుల్లో చక్కని అనుభంధం ఏర్పడింది. టివి ఆర్టిస్ట్‌ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా ఆర్టిస్ట్‌లకు సమస్య వస్తే పరిష్కారించుకుంటారు. అంతటి అవగాహన ఉంది. టివి రంగంలో ఆర్ధిక పుష్ఠి అవసరం. ఐక్యతతో టివి రంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముఖ్యఅతిథి బి నర్సింగ్ రావు మాట్లాడుతూ ...బాల నటుడుగా కెరీర్‌ను ప్రారంభించాను. అలా అన్ని రంగాల్లో ప్రవేశించి దర్శకునిగా మారాను. మళ్లి నటించమని చాల అడిగారు అని ఇష్టమైన నటన అయిన నటించలేదు. 25 ఎళ్ల క్రితం అయోరికా నుండి క్యాసేట్స్‌ వచ్చేవి వాటిని చూసేవాళ్లం. ఎప్పటి కప్పుడు అవగాహన ప్రతి విషయంలోను అవసరం. ఇప్పుడు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నాను. నూతనంగా ఎన్నకైన సభ్యులతో అభినందన సభ ఏర్పటు చేయడం సంతోషించాలసిన విషయం అని అన్నారు. ఈ సభలో ఎలక్షన్‌ ఆఫిసర్‌ సుధాకర్‌ , బి నర్సింగ్‌ రావు, ప్రభాకర్‌,వినోద్‌బాల ,విజయ్‌ , బొర్డు సభ్యులందరికి , ముఖ్యఅతిథులకు సన్మానం చేశారు. 150 మంది టివి ఆర్టిస్ట్‌లు అభినందన సభలో పాల్గోన్నారు. TV ARTIST UNION ELECTED COMMITTEE ప్రెసిడెంట్ : డా . యం వినోద్ బాల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ : భార్గవ గుత్తికొండ వైస్ ప్రెసిడెంట్ : రాంజగన్ , హరి ,జియస్ ప్రధాన కార్యదర్శి : విజయ్ యాదవ్ కోశాధికారి : సుబ్బారావు .సిహెచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ : నాగమణి .ఎ జాయింట్ సెక్రటరీ : ప్రభాకర్ .పి ,శ్రీ శశాంక్ జి , రామకృష్ణ మేకా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ : నగేష్ కర్రా , బాలాజీ , వాజ్ పేయి , బ్యాంక్ శ్రీనివాస్ , సుబ్బారావు ,టివి , రాజేశ్వరి ఢీల్లీ , ఉమాశ్రీ , ఉమాదేవి , రమ్యా నాయుడు

No comments:

Post a Comment